in

surya disappoints his fans again!

సినిమా తీయడం దగ్గర నుంచి అది రిలీజ్ అయ్యే వరకు అంతా టెన్షనే టెన్షన్. ఆ టెన్షన్ లో ఉన్నాడు తమిళ హీరో సూర్య. సినిమా అంతా పూర్తయి రిలీజ్ కి సిద్ధంగా ఉన్నా..ఏవో అడ్డంకులతో ఈ చిత్ర రిలీజ్ ఆగిపోతోంది. దాంతో ఫ్యాన్సే కాదు సూర్య కూడా నిరాశలోనే ఉన్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా. సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రం. ఈ చిత్ర రిలీజ్ కు మరోసారి బ్రేక్ పడింది. ప్రభుత్వం నుంచి మరికొన్ని అనుమతులు రావాల్సిన నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దాంతో తమిళ స్టార్ హీరో సూర్య అభిమానులు నిరాశ చెందారు.

హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు సూర్య. కాగా సూర్య తాజాగా నటించిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఇది వేసవిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇన్ని నెలల తర్వాత ఆ సినిమా ఓటీటీ లో విడుదలకు అమెజాన్ తో డీల్ కుదుర్చుకుంది. ఈ నెల 30 న అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా మరోసారి ఈ మూవీ విడుదలకు బ్రేక్ పడింది. దీపావళి కానుకగా నవంబర్ 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం.

jr ntr to romance samantha again!

producer changed for ‘shyam singha roy’!