in

Suriya and Sudha Kongara reunite, Dulquer, Nazriya on board!

మిళ సినిమా నాట అలాగే తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోస్ లో సూర్య ఒకడు. మరి సూర్య హీరోగా నటిస్తున్న భారీ చిత్రం “కంగువ” కాగా దీనికి ముందు వచ్చిన ఈటి భారీ డిజాస్టర్ అయ్యింది. సూర్య ఫిల్మోగ్రాఫి చూస్తే పలు క్లాసిక్ హిట్ చిత్రాలు కూడా ఉంటాయి. మరి అలా బ్యాక్ టు బ్యాక్ ఓటిటి లోనే రిలీజ్ అయినప్పటికీ నేషనల్ వైడ్ గా కూడా మంచి గుర్తింపు అందుకున్న చిత్రాలే ఆకాశం నీ హద్దురా మరియు జై భీం. మరి ఈ చిత్రాల్లో లేడీ డైరెక్టర్ సుధా దాస్ కొంగర తో చేసిన ఆకాశం నీ హద్దురా ఆల్ మోస్ట్ ఆస్కార్ వరకు కూడా వెళ్ళింది..

అని ఇండియన్ సినిమా దగ్గర సూర్య కెరీర్ లో మంచి హిట్ సినిమాగా నిలిచిన ఈ సినిమా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావడం ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. కాగా గత కొన్ని రోజులు నుంచి అన్ అఫీషయల్ బజ్ ఉంది కానీ ఇపుడు అఫీషయల్ గా అయితే దీనిని అనౌన్స్ చేసేసారు. అయితే ఈసారి ఓ సాలిడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా లాంటిది ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తుండగా నటి నజ్రియా నజీమ్ ఫహద్ కూడా ఉన్నట్టుగా రివీల్ చేశారు. .!!

clash between rashmika and mythri movie makers?

beauty Amala Paul all set for second marriage!