అందం, అభినయంలో హీరోయిన్లకు ఏమాత్రం తక్కువకానీ సహజ వ్యక్తిత్వం సురేఖావాణి సొంతం. చాలా సినిమాల్లో సురేఖ సపోర్టింగ్ రోల్స్ చేశారు. హీరోయిన్ రేంజ్ గ్లామర్.. ఆకర్షణీయమైన రూపంతో సురేఖను చూడగానే నచ్చేసేలా ఉంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమె నటన ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అయ్యేది. తన టీనేజ్ డాటర్ తో సురేఖ చేసే వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉంటారు. 2019లో సురేఖావాణి భర్త సురేష్ తేజ అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచాడు. దీంతో సురేఖావాణి తన కూతురు సుప్రీతతో కలిసి ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేఖావాణి కుటుంబం ఆమెను మళ్లీ పెండ్లి చేసుకోవాలని సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. సుప్రీత కూడా తన తల్లి సురేఖావాణిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తుందట. ఈ వార్త ఎంతమేరకు నిజమే తెలియదుగాని, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..