బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి కూడా హీరోయిన్గా అడుగుపెట్టి చాలాకాలమే అవుతోంది. కానీ తన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చే సినిమా ఇప్పటివరకు అతియా శెట్టికి దొరకలేదు. అయితే ఇంతలోనే తాను క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో ప్రేమలో పడింది అంటూ రూమర్స్ మొదలయ్యాయి. అంతే కాకుండా అతియా శెట్టి తన ఫ్యామిలీ మీటింగ్స్‌కు కూడా రాహుల్ వెళ్లడంతో ఈ రూమర్స్ నిజమే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఇక తాజాగా కెఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి గురించి బాలీవుడ్ అంతా మాట్లాడుకుంటోంది…
త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది అని వదంతులు ఎక్కువయిపోయాయి. దీంతో అతియా కూడా వీటిపై స్పందించింది. తాను కొత్త ఫ్లాట్‌కు షిఫ్ట్ అయ్యే మాట నిజమేనని, కానీ అది తన ఫ్యామిలీతోనే అని స్పష్టత ఇచ్చింది అతియా. ఇక పెళ్లి రూమర్స్‌పై కూడా తాను స్పందించింది. తాను ఈ ప్రశ్నలకు బదులివ్వనని చెప్పేసింది అతియా శెట్టి. ఇలాంటి వాటి వల్ల తాను అలసిపోయానని చెప్పింది. ఇలాంటి వార్తలు విని నవ్వుకోవడం తప్ప సమాధానం చెప్పదలచుకోలేదని క్లారిటీ ఇచ్చేసింది. ప్రజలకు వారికి నచ్చినట్టుగా ఆలోచించుకోనీ అని ఈ టాపిక్‌ను కట్ చేసేసింది అతియా. దీనిపై అతియా కుటుంబ సభ్యులు కూడా ఇలాగే స్పందించారు.