in

its official: Disha Patani joins cast of Prabhas ‘project k’

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా ఇమేజ్‌ తెచ్చుకున్న ప్రభాస్‌ కు ఈ మధ్య ఏదీ కలిసిరావడం లేదు. బాహుబలి రెండు భాగాల తర్వాత చేసిన సాహో హిందీలో బాగా ఆడినప్పటికీ తెలుగులో మాత్రం అంతంతమాత్రంగానే కలెక్షన్లు వసూలు చేసింది. ఆ తర్వాత భారీ బడ్జెట్‌తో చేసిన రాధేశ్యామ్‌ బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడింది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆశలన్నీ సలార్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కె మీదనే పెట్టుకున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్‌ కెలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్‌ కె మూవీలోకి మరో హీరోయిన్‌ను తీసుకున్నారు. బాలీవుడ్‌ భామ దిశా పటానీకి వెల్‌కమ్‌ చెప్తూ ఆమెకు పుష్పగుచ్చాన్ని పంపారు. దీంతో సర్‌ప్రైజ్‌ అయిన దిశాపటానీ బొకే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. కాగా పాన్‌ ఇండియాగా తెరెక్కుతున​ ప్రాజెక్ట్‌ కె తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి తోట రమణి ఓ ఆర్ట్‌ డైరెక్టర్‌. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నాడు.

sunil shetty’s daughter Athiya reacts to rumours wedding with KL Rahul!

Actress Kyra Dutt Stills

Actress Kyra Dutt Stills