in

sunil shetty to play villain in balayya’s movie?

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రెండు సినిమాలు వీరి కాంబోలో వచ్చి ఘన విజయం సాధించాయి కనుక వీరి కాంబో లో హ్యాట్రిక్ ఖాయం అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. దర్శకుడు బోయపాటి కూడా తనపై పెట్టుకున్న నమ్మకంను వమ్ము కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అందుకు సంబంధించి ప్రతి విషయంలో కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బాలయ్య కోసం బాలీవుడ్ స్టార్ నటుడిని విలన్ గా రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేసే అవకాశం ఉందని మొదట ప్రచారం జరిగింది. కాని తాజాగా సునీల్ శెట్టిని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే ఆయన సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడని అంటున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో సునీల్ శెట్టి ఎంట్రీతో మరింతగా సినిమా స్థాయి పెరుగుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సునీల్ శెట్టి మోసగాళ్లు సినిమాలో మంచు విష్ణుతో కలిసి నటించిన విషయం తెల్సిందే. బాలయ్య కు సునీల్ శెట్టి ఖచ్చితంగా సరైన ప్రత్యర్థి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Alia Bhatt to sing a special song in ‘rrr’!

allu arjun lists in 25 most influential young Indians 2020!