in

allu arjun lists in 25 most influential young Indians 2020!

ప్పడూ ఏదో ఒక సర్వే జరుగుతూనే ఉంటుంది. అందులో మన సెలెబ్రిటీస్ చోటు దక్కించుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. 2020 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్‌ ఇండియన్స్‌ లిస్ట్‌లో అల్లు అర్జున్ చోటు దక్కించుకోవడం గొప్ప విషయం. 2020లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 25 మంది‌ వ్యక్తులను జిక్యూ ఇండియా ప్రకటించింది. అందులో అల్లుఅర్జున్ కూడా చోటు దక్కించుకున్నాడు. దానికి కారణం మరేదో కాదు ‘అల వైకుంఠపురములో’ సినిమానే.  త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో తెలుసు.

ఇక ఈ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశాలు కాదు ఖండాలు దాటి మరి ఈ పాటలు పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఎక్కడో దగ్గర వినిపిస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా ‘రాములో రాములా’ సాంగ్‌ మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ పాట ఫుల్‌ వీడియో ఇప్పటి వరకు 300 మిలియన్లు సాధించింది. ఇక ఇదే జిక్యూ ఇండియా మోస్ట్‌ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్‌ ఇండియన్స్‌ లిస్ట్‌లో స్థానం కల్పించేలా చేసింది.

sunil shetty to play villain in balayya’s movie?

Mehreen Kaur Pirzada confirms her engagement next month!