
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]రెం[/qodef_dropcaps] డు రోజులుగా ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి మళ్లీ వార్తలు మొదలయ్యాయి. సందీప్ కిషన్ హీరోగా కొత్త దర్శకుడు ఒకరు ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారంటూ వార్తలొచ్చాయి. దానిపై చాలా చర్చలు కూడా జరుగుతున్నాయి. అసలు తేజ తెరకెక్కించాలనుకున్న బయోపిక్ కాస్తా ఇప్పుడు కొత్త దర్శకుడి చేతుల్లోకి వెళ్లిందేంటి.. ఆయన దీనికి న్యాయం చేయగలడా అంటూ చాలా అనుమానాలు కూడా వచ్చాయి. పైగా సందీప్ కిషన్ హీరో అనేసరికి అంచనాలు కూడా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఈ కుర్ర హీరో దీనిపై క్లారిటీ ఇచ్చాడు. రెండు మూడు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు తప్పు అని.. తన దగ్గరికి ఏ బయోపిక్ రాలేదని.. వచ్చినా కూడా ఇప్పుడు బయోపిక్స్ చేసే మూడ్ లో లేనని క్లారిటీ ఇచ్చాడు. ఉదయ్ కిరణ్ బయోపిక్ లో నటిస్తున్నానంటూ వచ్చిన వార్తలన్నీఅబద్ధమే అని చెప్పాడు ఈయన. ఇప్పటి వరకు దీని గురించి తనను ఎవరూ అప్రోచ్ కాలేదని చెప్పిన సందీప్.. అసలు బయోపిక్స్ లో నటించే ఆసక్తి కూడా లేదని తేల్చేసాడు. మొత్తానికి ఈయనే చెప్పడంతో ప్రస్తుతానికి ఈ బయోపిక్ టాపిక్ కు ఎండ్ కార్డ్ పడిపోయినట్లే.