in

ILEANA CAREER NI MARCHESINA AAYESHA!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లొ మర్చిపోలేని సినిమా ‘పోకిరి’, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకేకించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం లొ మహేష్ కి జంటగా నటించింది గోవా బ్యూటీ ఇలియానా, పోకిరి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పూరి – మహేష్ లకే కాకుండా ఇలియానా కి కూడా ఈ చిత్రం తనకి టాలీవుడ్ లొ పులా బాట వేసింది అనె చెప్పాలి. పోకిరి తరువాత ఇలియానా కు టాలీవుడ్ లొ ఆఫర్లు కుప్పలు తట్టలుగా వచ్చాయి. అయితే ఇక్కడ అసలు సంగతేంటి ఆంటే పూరి ముందుగా పోకిరి లొ హీరోయిన్ గ సెలెక్ట్ చేసుకుంది ఇలియానా ని కాదట..బాలీవుడ్ బ్యూటీ ఆయేషా టాకియాను తీసుకోవాలనుకున్నాడట పూరీ. కింగ్ నాగార్జున తొ సూపర్ మూవీ లొ జత కట్టిన ఆయేషా టాకియాకు మొదట పోకిరి ఆఫర్ వచ్చిందట కానీ కొన్ని కారణాల వల్ల అయేషా ఈ సినిమాను చేయలేకపోయింది. కారణం ఏదైతేనేం అయేషా కు వచ్చిన మంచి ఆఫర్ ను వదులుకోవడం నిజంగా ఆమె బ్యాడ్ లక్ అనె చెప్పాలి.

balayya’s new trendy dance!

sundeep kishan finally gave clarity on uday kiran’s biopic!