in

Suman gari career ne marchesina car mechanic!

సినిమా ప్రపంచం ఒక మాయ లోకం , ఇక్కడ విజయం ఒక శాతం, మిగతా 99 శాతం కృష్ణ నగర్, ఫిలిం నగర్ లో “ఒక్క ఛాన్స్” అంటూ తరుగుతుంటారు. కొంతమంది హీరో అవ్వాలి అని ప్రయత్నం చేసి హీరో గ అవుతారు, కొంతమంది వారసత్వంగా వస్తారు, మరి కొంతమంది అనుకోకుండా సినిమా ఇండస్ట్రీ కి వస్తారు, అలాగా వచ్చిన వారే హీరో సుమన్ గారు. ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని కుటుంబం , తల్లి ప్రిన్సిపాల్, తండ్రి ఇండియన్ ఆయిల్ కంపెనీ ఉద్యోగి. మరి సుమన్ గారు హీరో ఎలా అయ్యారు?. తమ కార్ రిపేర్ చేయటానికి వచ్చిన మెకానిక్ కిట్టు ఎంకరేజ్మెంట్ తో హీరో అయ్యారు చాల విచిత్రం గ ఉంది కాదు, అదే విధి అంటే.మెకానిక్ కిట్టు గారు ట్రావెల్ ఏజెంట్ కం మెకానిక్ అండ్ పార్ట్ టైం యాక్టర్ కూడా. సుమన్ గారి కార్ రిపేర్ చేయటం కోసం వచ్చిన కిట్టు గారు సుమన్ గారిని చూసి, ఫ్యూచర్ మెటీరియల్ గ గుర్తించి, ఆ విషయం సుమన్ గారి తో చెపితే సుమన్ గారు చిరునవ్వుతో తిరస్కరించారు. పట్టు వదలని కిట్టు గారు సుమన్ తల్లి గారిని కాన్వెంస్ చేయ గలిగారు. అనుకోకుండా సుమన్ గారితో కలసి కరాటే క్లాసులకు వెళ్లిన కిట్టు గారు అక్కడ సుమన్ గారి యాక్షన్ మూవ్మెంట్స్ చూసి , ఎలాగయినా సుమన్ హీరో చేయాలి అని డిసైడ్ అయ్యారు.చివరికి సుమన్ గారి తల్లి, నీకు ఇంటరెస్ట్ ఉంటె ఒక ట్రయిల్ చేయి ఇష్టం లేక పోతే మానేయవచ్చుఁ, కిట్టు అంతగా చెపుతున్నాడు కదా అని సుమన్ గారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం తో, సుమన్ గారు కూడా ఓ.కే. ట్రై చేద్దాం అనుకోని కిట్టు గారి కి ఓ.కే.చెప్పారు. కిట్టు గారు, వెంటనే సుమన్ గారిని ఆర్.ఆర్. పిక్చర్స్ టీ.ఆర్. రామన్న గారి వద్దకు తీసుకొని వెళ్లారు, నాకు ఇటువంటి హీరో నే కావాలి నా కొత్త మూవీ కి హీరో కోసం చూస్తున టైం లో తీసుకొని వచ్చావు, ఇతనే నా హీరో అని డిక్లేర్ చేసారు, నెక్స్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము అని అనౌన్స్ చేసారు.కంగారుపడిన సుమన్ గారు రోజు ఒక సినిమా చూడటం మొదలు పెట్టి యాక్షన్ అంటే ఏమిటి అని తెలుసుకొనే ప్రయత్నం మొదలు పెట్టారు, తమిళ్ లో సుమన్ గారి ఫస్ట్ మూవీ “నీచల్ కులం”, అందులో పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ , సినిమా మంచి హిట్ అయింది తమిళ్ లో వరుస అవకాశాలు దక్కించుకున్నారు.తెలుగు నటుడు భానుచందర్ తో పరిచయం, అయన సుమన్ గారిని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారికి పరిచయం చేసారు, భానుచందర్ , సుమన్ కాంబినేషన్ లో ఇద్దరు కిలాడీలు అనే మూవీ స్టార్ట్ చేసారు భరద్వాజ గారు, మూవీ షూటింగ్ కొంత డిలే అవటం తో గ్యాప్ లో ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్, “తరంగిణి ” మూవీ లో నటించారు ఈ ఇద్దరు నటులు, ముందుగా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది, ఒక సంవత్సరం నడిచింది ఈ సినిమా, సుమన్ స్టార్ అయిపోయారు వరుస అవకాశాలు, లేడీస్ ఫాలోయింగ్ తో ఒక వెలుగు వెలిగారు సుమన్ గారు.పూర్తి స్థాయి తెలుగు నటుడిగా స్థిరపడిపోయారు. “99 నాట్ అవుట్ హీరో గ, విల్లన్, క్యారెక్టర్ యాక్టర్ అన్ని కలసి 200 మూవీస్ పైగా నటించారు సుమన్ గారు ఎన్.టి.ఆర్. తరువాత రాముడిగా, కృష్ణుడిగా మరియు వెంకటేశ్వర స్వామి గ నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు సుమన్ గారు. మెకానిక్ కిట్టు గారి పట్టు తెలుగు సినిమా కు సుమన్ వంటి మంచి నటుడిని అందించింది.ప్రెసిడెంట్ అఫ్ ఇండియా , శంకర్ దయాల్ శర్మ గారి ప్రక్కన కూర్చొని తాను వేంకటేశ్వర స్వామి గ నటించిన అన్నమయ్య చిత్రం చూసే స్థాయి కి ఎదిగారు సుమన్ గారు, తనకు వచ్చిన అవార్డులు, రివార్డు ల కంటే ఈ అనుభవం చాల అద్భుతం అంటారు సుమన్ గారు.

Leave a Reply

Loading…

0

happy birthday chithra!

15 minutes cut for comrade!