యాంకర్ సుమ కనకాల ఆడపడుచు మరణం తర్వాత సుమ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. . ఎంతమంది యాంకర్స్ వచ్చినా కూడా సుమ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అంటూ అంతా ముక్తకంఠంతో చెప్తుంటారు.అయితే కొద్ది రోజులుగా ఇకపై ఈమె సుమ కనకాల కాదు.. కేవలం సుమ మాత్రమే.. పేరు వెనక కనకాల పక్కకెళ్లిపోతుందని ప్రచారం జరుగుతుంది.అంటే భర్త రాజీవ్ కనకాలతో విడిపోతుందనే పుకారులు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం ఇప్పుడెవరికి అంతు చిక్కడం లేదు. ఈమె విడాకులు తీసుకోబోతుంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.. కానీ వాళ్లు స్పందించడం లేదు. ఇప్పుడు స్పందించే పరిస్థితుల్లో కూడా లేరు.
ముఖ్యంగా సుమ సంపాదన విషయంలో రాజీవ్ కనకాలకు పడటం లేదని.. ఆయన ఓర్చుకోలేకపోతున్నారని కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి.కానీ తనకు అలాంటివి సంబంధమే లేదని.. భార్య సంపాదన నుంచి రూపాయి కూడా అడగలేదని.. ఎంత సంపాదిస్తున్నావని ఏ రోజు తాను ప్రశ్నించలేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రాజీవ్. కానీ ఇప్పుడు ఈ కారణమే వీళ్లను విడిపోయేలా చేస్తుందని ప్రచారం జోరుగానే జరుగుతుంది.అయితే ఈ వార్తలు నిజమో కాదో తేలాలి అంటే సుమా కనకాల మీడియా ముందుకు రావాల్సిందే..