in

Sukumar to come up with a high budget web-series for ‘aha’!

తొలి తెలుగు ఓటీటీగా రంగంలోకి దిగిన ఆహా తన స్ట్రాటజీని మార్చుకుంటూనే ఉంది. ఓటీటీ వేదికలో తొలిసారి టాక్‌షోలను పరిచయం చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆహా.. ఒరిజినల్స్‌ పేరుతో వెబ్‌ సిరీస్‌లను సైతం తెరకెక్కిస్తోంది. అయితే ఇప్పుడా వెబ్‌ సిరీస్‌లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే అగ్ర దర్శకుడు సుకుమార్‌ను రంగంలోకి దింపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆహా వేదికగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న వెబ్‌ సిరీస్‌కు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌కు ఇప్పటి వరకు లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్‌ను కేటాయించేందుకు ఆహా సంసిద్ధత తెలపడంతో త్వరలోనే వెబ్‌ సిరీస్‌ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. అయితే సుకుమార్‌ కథ, మాటలు అందించనున్న ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం ఎవరు వహిస్తారన్న విషయం తెలియాల్సి ఉంది.

ఇక దీనిని సుకుమార్‌ రైటింగ్స్‌, ఆహా సంయుక్తంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వెబ్‌ సిరీస్‌ కథకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు హల్చల్‌ చేస్తోంది. ఓ సామాన్య వ్యక్తి, వ్యవస్థను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడన్న కథాంశంతో ఈ వెబ్‌ సిరీస్‌ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో సుకుమార్‌ దర్శకత్వం వహించిన జగడం, తాజాగా వచ్చిన పుష్ప కూడా ఇలాంటి కథాంశంతో వచ్చిన విషయం తెలిసిందే..

naveen polishetty punch dialogues on prabhas movie budgets!

shyam singha roy!