వరల్డ్ వైడ్ గా సెకండ్ వీక్ లోనే 200కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. అయితే అన్ని వర్గాల నుండి పుష్పకి పాజిటీవ్ టాక్ ఉన్నా.. కొన్ని నెగెటీవ్స్ పై కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ముఖ్యంగా విలన్ ఫహద్ ఫాజిల్, అల్లు అర్లున్ ల క్లైమాక్స్ సీన్ పై మాస్ ఆడియన్స్ కాస్త నిరుత్సహాంగానే ఉన్నారని ఇండస్ట్రీ టాక్. ఇంకాస్త బెటర్ ఇంపాక్ట్ ఉన్న క్లైమాక్స్ ఉండి ఉంటే పుష్ప రేంజ్ మరోలా ఉండేదని అంటున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్ స్పందించాడు.
పుష్ప మూవీ క్లైమాక్స్ సీన్ లో బన్నీ అర్ధనగ్నంగా కనిపించటంపై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఫహద్ ఫాజిల్, అల్లు అర్లున్ లు ఇద్దరు అండర్ వేర్ లో కూర్చొని మాట్లాడుకునే సీన్ మాస్ ప్రేక్షకులకి ఏ మాత్రం కనెక్ట్ అవ్వలేదు. ఈ వినూత్న క్లైమాక్స్ సీన్‌పై దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘పుష్ప క్లైమాక్స్‌లో బన్నీ, ఫహాద్ ఇద్దరూ ప్యాంట్ షర్ట్ విప్పేసి సవాళ్లు విసురుకుంటారు. నిజానికి ఆ సీన్‌లో ఇద్దరినీ నగ్నంగా చూపించాలనుకున్నా.
కానీ, తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌ను అంగీకరించరని తెలిసి అప్పటికప్పుడు మార్పులు చేశాం’అని సుకుమార్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు పార్ట్ 2లో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. మొదటి భాగంతో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేశామని, అసలు కథ సెకండ్ పార్ట్‌లో ఉంటుందన్నాడు. మరి ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో చూడాలి’ అంటూ పుష్ప సెకండ్ హాఫ్ సీక్రెట్స్ రివీల్ చేశాడు సుకుమార్.