in

IDDARU SUPER STAR LA MANASU DOCHINA SHOBAN BABU!

ద్దరు సూపర్ స్టార్ లను మెప్పించిన శోభన్ బాబు గారి చిత్రం ” మానసుడు దానవుడు ” శోభన్ బాబు గారి సినిమాను 14 సార్లు చూసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. 1972 లో శోభన్ బాబు గారు డ్యూయల్ రోల్ చేసిన చిత్రం ” మానవుడు – దానవుడు ” ఇందులో ప్రాణం పొసే డాక్టర్ వేణుగా , ప్రాణాలు తీసే నరహంతకుడు జగన్ గ ప్రేక్షకులను మెప్పించారు శోభన్ బాబు గారు. జగన్ పాత్రలో శోభన్ బాబు గారి గెట్ అప్ మరియు పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చిత్రం ఘన విజయం సాధించింది. ఆయన పోషించిన జగన్ పాత్ర నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ ఆయన స్టైల్,డైలోగ్స్ మాస్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది.

ఆ సమయంలో ఇంకా చిత్ర రంగ ప్రవేశం చేయని రజనీకాంత్ “మానవుడు దానవుడు” సినిమా చూడటం జరిగింది, అందులో జగన్ పాత్రలో శోభన్ బాబు గారి స్టైల్, పంచ్ డైలోగ్స్ నచ్చటంతో ఈ చిత్రాన్ని 14 సార్లు చూశారట. ఇంకొక విశేషం ఏమిటంటే 1999 “మానవుడు దానవుడు” టైటిల్ తో సూపర్ స్టార్ కృష్ణ డ్యూయల్ రోల్ చేసారు. కధాంశం వేరైనప్పటికి, అందులో హీరోగా, విలన్ గ నటించిన కృష్ణ గారిని విలన్ పాత్రలో ఆయన అభిమానులు చూడలేక పోయారు, ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. తెలుగు, తమిళ సూపర్ స్టార్ల మనసు దోచిన సినిమా గ మానవుడు దానవుడు సినిమా నిలిచింది.

it’s official, Naveen Polishetty to team up with Anushka Shetty!

sukumar revealed Allu Arjun And Fahadh Were Supposed To Go Nude!