పుష్ప రాజ్ క్యారెక్టర్ పేరు గురించి డైరెక్టర్ సుకుమార్
పుష్ప-1, పుష్ప-2 సినిమాలు జాతీయస్థాయిలో విజయం సాధించడంతో రెండు,మూడేళ్లలో పుష్ప-3 తెరకెక్కిస్తామని మేకర్స్ కూడా ప్రకటించారు. అయితే.. అసలు ఈ సినిమాకు పుష్ప టైటిల్ ఎలా పెట్టామో దర్శకుడు సుకుమార్ వివరించారు. ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘మన దేశంలో ఎర్రచందనం స్మగ్లింగ్ భారీగానే జరుగుతోంది. దీనిని ఆధారంగా చేసుకుని సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది..
రియల్ స్మగ్లర్ పుష్ప పేరు వాడుకున్న సుకుమార్
ఇందుకు కొందరు ఎర్రచందనం స్మగ్లర్లను కలిసి ఇంటర్వ్యూ చేశా. సినిమా కోసం నా ఆలోచనల గురించి పలు విషయాలపై వారితో చర్చించా’. ‘అలా నేను ఇంటర్వ్యూ చేసిన స్మగ్లర్లలో ఒకతని పేరు పుష్పరాజ్. అతనిని అందరూ పుష్ప అని పిలుస్తారు. దీంతో నేను అనుకుంటున్న హీరో పాత్రకు ఈ పేరైతే బాగుంటుందని భావించా. నేషనల్ లెవర్ రీచ్ ఉంటుందని ఊహించా. అదే జరిగింద’ని సుకుమార్ తెలిపారు..!!