స్టార్ డం ఒక విచిత్రమయిన పురుగు, ఎంతటి నటి, నటులయిన ఒక సారి ఇది కరిచిందంటే “డమ్మీ” అయిపోవలసిందే. తెలుగు సినీ పరిశ్రమలో ఇటువంటి వారు చాలామందే ఉన్నారు. హీరోయిన్ రజని 1980 – 90 లో మంచి ఫార్మ్ లో ఉన్న నటి మణి. చేసింది తక్కువ సినిమాలే అయినా, మంచి హిట్స్ వచ్చాయి, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో చాల సినిమాలు చేసింది. నిర్మాత కింగ్ లాగా బ్రతుకుతున్న రోజులు అవి, త్రివిక్రమ రావు నిర్మాతగా, కల్యాణ చక్రవర్తి హీరోగా నిర్మిస్తున్న చిత్రం ” మేన మామ” ఇందులో హీరోయిన్ రజని. ఒక రోజు షూటింగ్ స్పాట్ కి వచ్చిన రజని, కొద్దీ సేపట్లోనే తిరిగి వెళ్లిపోతుండటం గమనించిన త్రివిక్రమ రావు, వెళ్లి కార్ ను ఆపారు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగారట, మీరు ఇవ్వవలసిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదు కాబట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పిందట. ఆలా వెళ్ళిపోతే ఎలాగమ్మా, నీ షాట్స్ కంప్లీట్ చేసి సాయంత్రం డబ్బు తీసుకో అన్నారట త్రివిక్రమ రావు..
అయినా కూడా మొండిగా కుదరదు నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పిందట రజని, కాదమ్మా నువ్వు వెళ్ళిపోతే ఈ రోజు షెడ్యూల్ వేస్ట్ అయిపోతుంది అని నచ్చ చెప్పిన వినకుండా వెళ్ళిపోబోయిందట రజని. దెబ్బకి కోపం నషాళానికి అంటిన త్రివిక్రమ రావు, జేబులో నుంచి రివాల్వర్ తీసి, ఎలా వెళతావో వేళ్ళు, ఇక్కడ నుంచి ఒక్క అడుగు కదిపినా కాల్చి పడేస్తాను అన్నారట. దెబ్బకు దెయ్యం దిగిన రజని సాయంత్రం వరకు షూటింగ్ చేసి తన డబ్బులు తీసుకొని వెళ్లిపోయిందట. వెళ్లే ముందు త్రివిక్రమ రావు, రజనికి క్లాస్ పీకారట,నీ టైం కి నువ్వు వచ్చి, నీ పని నువ్వు చేస్తే, ఎవడు నీ డబ్బులు ఆపరు, ఇంకో సారి ఇలా చేశావంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి పంపించారట. ఆ తరువాత కారణాలు తెలియదు కానీ రజని స్లో గ ఫేడ్ అవుట్ అయిపొయింది. అదండీ “స్టార్ డం” పురుగు తడాఖా! అంటే, అలాగే ఉంటుంది. ఈ పురుగు బాధితుల్లో ఈమె మొదటి కాదు చివరిది అంతకంటే కాదు, ఆ పురుగు బాధితులు ఇప్పటికి ఉన్నారు, ఉంటూనే ఉంటారు..!!