in

Nandamuri Balakrishna’s daughter Tejaswini to turn producer!

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సెలబ్రిటీ టాక్ షో కి ఒప్పుకోవడానికి కారణం తేజస్విని అట. ఇప్పటికీ కూడా షోలో బాలకృష్ణ వేసుకునే బట్టలు మరియు మిగతా విషయాలలో కూడా తేజస్విని చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా కొన్నిసార్లు బాలకృష్ణ సినిమాల విషయంలో కూడా తేజస్విని నిర్ణయాలు తీసుకుంటుందని సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ గా కాకుండా తేజస్విని తనకంటూ ఒక సొంత ప్రొడక్షన్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారాలని ప్రయత్నాలు చేస్తోందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే బాలకృష్ణ సినిమా తోనే తేజస్విని నిర్మాతగా మారబోతోంది. ఇప్పటికే చిరంజీవి కుటుంబం నుంచి సుష్మిత, నిహారిక, ఘట్టమనేని కుటుంబం నుంచి మంజుల, మంచు కుటుంబం నుంచి మంచు లక్ష్మి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తేజస్విని కూడా అదే బాటలో నడవనుందని తెలుస్తోంది..!!

stardom A DANGEROUS CREATURE!

thamanna: i want to get married and have kids soon