in

Star Maa Leaks Bigg Boss Telugu 6 OTT Contestants?

తెలుగులో సీజన్ 5 ఘనంగా ముగిసింది. ఈ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే రోజున హోస్ట్ నాగార్జున.. ఫిబ్రవరిలో మళ్లీ బిగ్‏బాస్ సందడి ఉంటుందని ప్రకటించారు. దీంతో బిగ్‏బాస్ సీజన్ 6 ఆ అంటూ సందేహాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే బిగ్‏బాస్ సీజన్ 6 కాదని.. బిగ్‏బాస్ ఓటీటీ అని.. ఇకపై 24 గంటలు బిగ్‏బాస్ షోను వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బిగ్‏బాస్ ఓటీటీ గురించి అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ లీస్ట్ ఫైనల్ అయ్యిందని.. ఇందులో మాజీ కంటెస్టెంట్స్ తోపాటు.. కొత్తవారు కూడా పాల్గొనబోతున్నారంటూ టాక్ నడుస్తోంది. గత సీజన్లలో పాల్గొన్న ముమైత్ ఖాన్, ఆదర్శ్, తనీశ్, ధన్ రాజ్, అరియానా, అఖిల్ పాల్గోనబోతున్నారని సమాచారం. అలాగే యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డ్యాన్స్ షో డీ 10 విజేత రాజు, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, సాఫ్ట్ వేర్ డెవలపర్ ఫేమ్ వైష్ణవి చైతన్య, శ్రీహాన్ పాల్గోనబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

disappointing : Suriya’s Jai Bhim Out of Oscar Race

It’s grateful, honour and happy to work with ravi teja sir : meenakshi