in

disappointing : Suriya’s Jai Bhim Out of Oscar Race

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల రేసు లో తప్పక నిలుస్తుందనుకున్న జైభీమ్ మూవీ స్వల్ప తేడాతో నామినేషన్ రేసు నుంచి ఔట్ అయింది. ఈ ఏడాది జరగనున్న 94 ఆస్కార్ అవార్డ్స్ వేడుకలలో జైభీమ్ చోటు దక్కించుకుంటుందని సినిమా అభిమానులు ఆశించారు. కానీ చివరి క్షణంలో వారికి నిరాశే ఎదురయ్యింది. ట్రెసీ, ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ నామినేషన్స్ వ్యాఖ్యతలుగా మంగళవారం ప్రకటించిన 94 ఆస్కార్ అవార్డ్స్ రేసులో జైభీమ్ తోపాటు  మరక్కార్ సినిమాలకు అవకాశం దక్కలేదు.

ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‏లో ద పవర్ ఆఫ్ ది డాగ్ సినిమా అత్యధికంగా 12 నామినేషన్స్ దక్కించుకోగా.. డ్యూన్ సినిమాకు 10, వెస్ట్ సైడ్ స్టోరీ, బెల్ ఫాస్ట్ చిత్రాలకు ఏడేసి చొప్పున నామినేషన్స్ పొందాయి. ఆస్కార్ అవార్డుల వేడుకలో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీకి అర్హత సాధించిన 276 సినిమాల్లో ఒకే ఒక్క తమిళ సినిమా జైభీమ్. హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా గతేడాది నవంబర్ 2న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Rockstar DSP completed all 6 songs within 30 minutes!

Star Maa Leaks Bigg Boss Telugu 6 OTT Contestants?