in

SSMB28: Pooja Hegde, Namrata Shirodkar and Trivikram attends the launch!

రోజు జరిగిన ఈ వేడుకకు మహేష్ బాబు హాజరుకాకపోవడంతో నమ్రత శిరోద్కర్ పాల్గోన్నారు. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటించనుంది. ఈ చిత్రాన్ని శ్రీమతి మమత సమర్పణలోటాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్య‌దేవ‌ర రాధా కృష్ణ ‌నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఉదయం 9 గంటల 53 నిమిషాలకు చిత్రం పూజా కార్యక్రమాలతో , ఆత్మీయ అతిథుల నడుమ వైభవంగా ప్రారంభమయింది.

చిత్ర కథానాయిక పూజ హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి శ్రీమతి నమ్రత శిరోద్కర్ క్లాప్ నిచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం రూపొందనుందని ప్రకటన వచ్చిన నాటినుంచి చిత్రం పై ఉత్సుకత ఇటు సినీ వర్గాల్లోనూ, అటు ప్రేక్షక వర్గాల్లోనూ నానాటికీ పెరుగుతూ వస్తున్నాయి.

బుట్టబొమ్మ మీద ఎప్పుడు స్పెషల్ ఇంటరెస్ట్ ఉండే త్రివిక్రమ్ తన సినిమాల్లో మూడోసారి హీరోయిన్గా సెలెక్ట్ చేసాడు.. వీటిని మరింతగా నిజo చేస్తూ ఈ చిత్రానికి సంభందించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మ‌హేష్‌బాబు , త్రివిక్ర‌మ్‏ ల హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభమవుతుంది.  ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తామని చిత్ర నిర్మాత ఎస్. రాధా కృష్ణ తెలిపారు…

Samantha says ‘F*** y**’ with her bold ripped t-shirt!

pelli sandhadi girl srileela shocks tollywood producers!