in

pelli sandhadi girl srileela shocks tollywood producers!

పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల.. ముద్దుగా బొద్దుగా ఉండడంతో పాటు వయ్యారాలు ఒలకబోయడంలో ఈ మాత్రం వెనకాడకపోయేసరికి మొదటి సినిమాతోనే అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా మొదటి సినిమానే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అయ్యేసరికి అమ్మడి పంట పండింది. ఈ సినిమా విజయం గురించి పక్కన పెడితే శ్రీలీల కు మాత్రం మంచి ఆఫర్లను తీసుకొచ్చిపెట్టింది.

పెళ్లి సందD విడుదల కాకముందే ఈ కుర్ర బ్యూటీ మాస్ మహారాజ రవితేజ సరసన ‘ధమాకా’ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. దీంతో పాటు పలు ప్రాజెక్ట్ లు సార్థం అమ్మడి చేతిలో ఉన్నాయట. ఇక ఇదే అదునుగా భావించిన ఈ హాట్ బ్యూటీ ఒక్కసారిగా పారితోషికం పెంచేసిందట. రెమ్యూనిరేషన్ లో తగ్గేదేలే అంటూ ఏకంగా కోటి డిమాండ్ చేస్తున్నదంట. చేసిందే ఒక్క సినిమా.. అది కూడా భారీ విజయం అనుకోలేదు. కానీ అమ్మడు మాత్రం ఏ ధీమాతో కోటి డిమాండ్ చేస్తుందని టాలీవుడ్ వర్గాలు నోళ్లు నొక్కుకుంటున్నాయట.

దీంతో శ్రీలీల ను హీరోయిన్ గా తీసుకోవాలంటే నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయట. ఏది ఏమైనా అమ్మడు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తుందని అర్ధమవుతుంది. అయితే ఎంత దీపం ఉంది కదా అని చలి కాచుకోవాలి కానీ ఇంటిని కాల్చేయలేం కదా.. అలానే నిదానంగా కెరీర్ లో ఎదిగితే బావుంటుంది కానీ.. ఇలా ఒకేసారి డిమాండ్ చేస్తే మొదటికే మోసం వస్తుంది చూసుకోమ్మా అని పలువురు శ్రీ లీల కు హితబోధ చేస్తున్నారట.

SSMB28: Pooja Hegde, Namrata Shirodkar and Trivikram attends the launch!

Story Written For Raviteja, accepted by prabhas!