
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 1996లో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. స్టార్ ప్రొడ్యూసర్స్ అశ్వినీదత్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీకి ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నారు. పెళ్లిసందD పేరుతో తీస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనిఉంది.