in

Sreeleela Walks Out, sakshi comes in For Vijay Devarakonda’s next?

విడి 12గా వ్యవహరించబడుతున్న ఈ సినిమాకు ముందు ఫిక్స్ చేసుకున్న హీరోయిన్ శ్రీలీల. ఇదే విషయాన్నీ నాగవంశీ మ్యాడ్ ప్రమోషన్లలో నొక్కి చెప్పారు. కానీ ఇప్పుడు తన స్థానంలో ఏజెంట్ భామ సాక్షి వైద్యని దాదాపు ఖరారు చేసినట్టు తెలిసింది. ఫ్యామిలీ స్టార్ కోసం తిన్ననూరి ప్రాజెక్టుని కాస్త లేట్ చేయడంతో శ్రీలీల జనవరి తర్వాత కొత్త సినిమాలకు డేట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. పైగా త్వరలో ఎంబిబిఎస్ పరీక్షల కోసం బ్రేక్ తీసుకోనుంది. తన కోసం వెయిట్ చేసే సిచువేషన్ లేకపోవడంతో సాక్షితో మాట్లాడి ప్రాథమికంగా ఓకే చేసినట్టు అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.

ఇది నిజమైతే సాక్షి వైద్య సుడి తిరిగినట్టే. ఎందుకంటే మొదటి రెండు సినిమాలు ఏజెంట్, గాండీవధారి అర్జున దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఛాన్స్ కొట్టేసి మిగిలిన హీరోయిన్లు ఈర్ష్య పడేలా చేసుకుంది. అది గ్యారెంటీ హిట్ అనే పాజిటివ్ వైబ్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ జోడిగా సెట్ అయిపోతే ఇంకో మైలురాయి తోడవుతుంది. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు కాబట్టి వేచి చూడాలి. ఇవి కాకుండా మరో రెండు ప్రతిపాదన స్టేజిలో ఉన్నాయి…!!

telugu Actress pragathi second marriage with a Producer?

Manchu Vishnu gets injured in Kannappa shoot!