in

sreeleela no scope for ‘Extraordinary Man’!

టీవల విడుదలైన ఆదికేశవ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. దీంతో అందరి చూపు ఆమె తదుపరి నటిస్తున్న “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ “సినిమా పైనే.. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 8వ తేదీన విడుదలకు సిద్ధం కాబోతున్న నేపథ్యంలో తీరిక లేకుండా ప్రమోషన్స్ లో గడుపుతున్నారు హీరో నితిన్. హీరో నితిన్ ఈ సినిమాలో శ్రీ లీల పాత్ర పై పలు షాకింగ్ కామెంట్లు చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాలో శ్రీ లీల పాత్ర ఎలా ఉండబోతోంది అని రీసెంట్ ఇంటర్వ్యూలో అడగగా..దానికి నితిన్ సమాధానం ఇస్తూ..ఒక కమర్షియల్ సినిమాలో హీరో.. హీరోయిన్ గా నటిస్తే సినిమా హిట్ అయితే పేరు వస్తుంది. ఇక ఈ సినిమాలో శ్రీ లీలా కూడా అంతే ఉంటుంది. ఆమెది గొప్ప పాత్ర అని నేను చెప్పను..అయితే నాలుగు పాటలు , నాలుగు ఫైట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆమె కనిపిస్తుంది అంటూ తెలిపారు. ఇక నితిన్ మాటలను బట్టి చూస్తే ఇందులో శ్రీలీల పాత్రకి పెద్దగా స్కోప్ లేదని తెలుస్తోంది..!!

Alia Bhatt is the latest victim of deepfake technology!

khushboo replaced with actress maheswari for jabardasth!