in

spicy update from mahesh babu’s guntur kaaram!

గుంటూరు కారం సినిమాలో ఒక ఐటెం సాంగ్ పెట్టబోతున్నారట. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం చాలామందిని అనుకోని చివరికి డింపుల్ హాయతిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. గద్దల కొండ గణేష్ సినిమాలో “సూపర్ హిట్టు నీ హైటు” అనే ఐటమ్ సాంగ్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన  ఖిలాడీ సినిమాలో కూడా హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది. అయితే ఏ సినిమా కూడా ఈమెకు మంచి గుర్తింపును అందివ్వలేదు..

మరోవైపు ఈ మధ్యనే పోలీస్ ఆఫీసర్ తో తగాదా పెట్టుకుని అందరి కళ్ళల్లో పడింది. ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ దృష్టిలో పడిన ఈమె..ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కి  పర్ఫెక్ట్ అని ఈమెను తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే డింపుల్ రేంజ్ కూడా మారిపోతుంది అనడంలో సందేహం లేదు.  మరి త్వరలోనే డింపుల్ హయతిని అధికారికంగా ప్రకటిస్తారా లేదా అన్నది చూడాలి. ఇక మహేష్ బాబు ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నారు..!!

happy birthday nagma!

busy bee sreeleela skipping her mbbs exams for films?