in

SPECIAL SET FOR ‘RADHE SHYAM’ IN HYDERABAD!

డార్లింగ్’ త‌రువాత పూర్తిస్థాయి ప్రేమ‌క‌థా చిత్రాల‌కు దూర‌మైన ప్ర‌భాస్.. దాదాపు ద‌శాబ్దం త‌రువాత న‌టిస్తున్న ల‌వ్ స్టోరీ ‘రాధే శ్యామ్’. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే నాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా పిరియ‌డ్ ల‌వ్ సాగాగా తెర‌కెక్కుతోంది. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. మల్టిలింగ్వ‌ల్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని 2021 వేస‌విలో విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవ‌లే ఇట‌లీలో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేసుకుని భార‌త్ కు తిరిగి వ‌చ్చింది యూనిట్. త్వ‌ర‌లోనే అన్న‌పూర్ణ స్టూడియోస్ లో కొత్త షెడ్యూల్ కి శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. అంతేకాదు.. ఈ షెడ్యూల్ లో ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ని పిక్చ‌రైజ్ చేయ‌నున్నార‌ట‌. సినిమాలో ఉండే ఒకే ఒక యాక్ష‌న్ సీన్ ఇదేన‌ని.. రూ.2 కోట్ల వ్య‌యంతో చిత్రీక‌రించే ఈ స‌న్నివేశం సినిమాకి ఓ హైలైట్ గా నిలుస్తుంద‌ని టాక్.

kajal agarwal into new business?

PRODUCER C KALYAN GAARI AMAVASYA SENTIMENT!