in

south sensation Samantha tops Pan India stars list!

మంత టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరు. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ ఒక్కటే కాదు.. పాన్‌ ఇండియా లెవల్లోనూ ఆమె పేరు మార్మోగుతోంది. ఆర్మాక్స్‌ మీడియా తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. పాన్‌ ఇండియా ఫిమేల్‌ స్టార్స్‌ లిస్ట్‌లో సమంత టాప్‌లో ఉండటం విశేషం. బాలీవుడ్‌ను ఏలుతూ.. అక్కడి హీరోలతో సమానమైన క్రేజ్‌ ఉన్న ఆలియా భట్‌ కూడా రెండోస్థానంతో సరిపెట్టుకుంది.

ఈ లేటెస్ట్ సర్వేకు సంబంధించిన ఫలితాలను ఆర్మాక్స్‌ మీడియా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. సమంత మాత్రమే కాదు.. ఈ లిస్ట్‌ టాప్‌ టెన్‌లో సౌత్‌ హీరోయిన్ల హవానే ఎక్కువగా ఉంది. పది మందిలో ఏడుగురు సౌత్‌ మూవీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే కావడం విశేషం. లేడీ సూపర్‌స్టార్‌గా పేరుగాంచిన నయనతార ఈ లిస్ట్‌లో మూడోస్థానంలో ఉండగా.. ఈ మధ్యే అమ్మయిన కాజల్‌ అగర్వాల్‌ నాలుగోస్థానంలో ఉంది.

ఇక బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకోన్‌ ఐదోస్థానంతో సరిపెట్టుకుంది. ఆమె తర్వాత రష్మిక మందన్నా అనుష్క శెట్టి, కత్రినా కైఫ్‌, కీర్తి సురేశ్‌, పూజా హెగ్డే ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో సమంత నార్త్‌ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఆ సిరీస్‌లో ఆమె నటనకు ఫిదా కాని వాళ్లు లేరు. ఆ తర్వాత పుష్ప మూవీలో ఐటెమ్‌ సాంగ్‌తో నార్త్‌లో సమంత రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది..

F3: Fun and Frustration!

venky mama reveals why he Can’t Host A Reality Show!