in

south diva Keerthy Suresh’s Bollywood entry with Varun Dhawan!

ఈమధ్య దక్షిణాదికి చెందిన నయనతార హిందీలో షారుఖ్ ఖాన్ పక్కన నటించి ‘జవాన్’ సినిమాతో ఆరంగేట్రం చేసి పెద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు ఇంకో నటీమణి కీర్తి సురేష్ హిందీలో ఆరంగేట్రం చేయబోతోంది. ఆమె వరుణ్ ధావన్ పక్కన నటిస్తోంది. తమిళ సినిమా ‘తెరి’ హిందీలో రీమేక్ చేస్తున్నారు, దాంట్లో కీర్తి సురేష్ ఒక కథానాయికగా నటిస్తోంది. ఆసక్తికరం ఏంటంటే ‘జవాన్’ తో హిట్ కొట్టిన దర్శకుడు అట్లీ, ఈ ‘తెరి’ తమిళ సినిమాకి దర్శకుడు..

అందుకే ఇప్పుడు ఈ హిందీ రీమేక్ సినిమాకి అతను నిర్మాతల్లో ఒకడుగా వున్నాడు, మురాద్ ఖేతని  ఇంకో నిర్మాత. వరుణ్ ధావన్ ఇంతకు ముందు ‘సిటాడెల్’ అనే హిందీ వెబ్ సిరీస్ చేసాడు, దానికి ‘రాజ్ & డికె’ దర్శకులు కాగా, అందులో సమంత కథానాయిక. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదలవుతుంది అని అంటున్నారు. నయనతార, కీర్తి సురేష్ కాకుండా, సాయి పల్లవి కూడా హిందీలో డెబ్యూ చెయ్యడానికి రెడీ అవుతోంది..!!

WHERE IS RAMU?

‘Baby’ fame Vaishnavi Chaitanya grabs a biggie?