వాహిని స్టూడియో లో సౌండ్ ఇంజినీర్ గ జీవితం ప్రారంభించి డైరెక్టర్ అయినా వారు కళాతపస్వి కె.విశ్వనాధ్ గారు, అదే విధం గ సౌండ్ ఇంజినీర్ వృత్తి నుంచి నటుడిగా ఎదిగిన వారు ఒకరు ఉన్నారు. ఆయనే వెండి తేరా ఆంజనేయుడు గ గుర్తింపు పొందిన ఆర్జ.జనార్ధన రావు. రాముడు, కృష్ణుడు అనంగానే యెన్.ట్.ఆర్. నారదుడు అనగానే కాంత రావు గుర్తు వచ్చినట్లు, ఆంజనేయుడు అనగానే ఆర్జ.జనార్ధన రావు గుర్తుకు వచ్చేవారు. ఆర్జ జనార్ధన రావు మంచి బాడీ బిల్డర్, 1951 లో మిస్టర్ హెర్క్యూలేస్ , 1955 లో మిస్టర్ .ఇండియా గ ఎంపిక అయ్యారు. బి.ఎస్.సి చదివిన అయన సౌండ్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసి మద్రాస్ శ్యామల స్టూడియోలో సౌండ్ ఇంజినీర్ గ పని చేసే వారు, నటుడు అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు..రికార్డింగ్ జరుగుతున్నపుడు, లిరిక్ రైటర్స్, డైరెక్టర్స్ జనార్ధన రావు దగ్గరకు వచ్చే వారు, ఆ విధంగా లిరిక్ రైటర్ మల్లాది, రామకృష్ణ శాస్ట్రీ గారి తో పరిచయం ఏర్పడింది.
జనార్ధన రావు శరీర దారుఢ్యం చూసిన శాస్ట్రీ గారు తాను వ్రాస్తున్న వీరాంజనేయ సినిమాలో ఆంజనేయుడు గ ఇతనైతే బాగుంటాడు అనుకోని, దర్శకుడు కమలాకర కామేశ్వర రావు కి పరిచయం చేయటం, ఆయన స్క్రీన్ టెస్ట్ చేసి ఒకే చెప్పటం తో సౌండ్ ఇంజినీర్ కాస్త వెండి తెర ఆంజనేయుడు అయి పోయాడు. అది మొదలు వరసగా ఆంజనేయుడు పాత్రలు ధరించారు ఆర్జ. జనార్ధన రావు , వెండి తెర ఆంజనేయుడిగా మంచి గుర్తింపు పొందారు, కానీ దురదృష్టం ఏమిటంటే సోషల్ మూవీస్ లో ఆయనకు విలన్ పాత్రలు మాత్రమే ఇచ్చేవారు దర్శక, నిర్మాతలు. మొనాటనీ ఫీల్ అయిన జనార్ధన రావు నటనకు గుడ్ బయ్ చెప్పేసి, తిరిగి సారధి స్టూడియోస్ లో సౌండ్ ఇంజినీర్ గ చేరిపోయారు. తన శేష జీవితం మొత్తం సౌండ్ ఇంజినీర్ గానే గడిపేశారు..!!