in

Telugu beauty Dimple Hayathi item song in indian 2?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. ఇందులో ఎక్కువమంది ఇతర భాషలకు చెందిన వారే ఎక్కువ. మన తెలుగు వారు చాలా తక్కువ. అయితే ఉన్నవారిలో డింపుల్ హయాతి పక్కా తెలుగు హీరోయిన్. ఈ బ్యూటీ సినిమాలు చేసింది తక్కువే అయినా..ఎప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గల్ఫ్ అనే సినిమాతో చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఇక ఇటీవల రవితేజ నటించిన కిలాడి, గోపీచంద్ చేసిన రామబాణం సినిమాలలో మెరిసింది ఈ బ్యూటీ.

అయితే తాజాగా ఈ బ్యూటీ గురించి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో కాజల్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట. ఈ ఐటెం సాంగ్ లో నటించేందుకు డింపుల్ హయాతిని ఫైనల్ చేసిందట చిత్ర బృందం. సినిమా యూనిట్ ఇచ్చిన ఆఫర్ కు హయాతి కూడా ఒప్పుకుందట..ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం..!!

samyuktha or sreeleela, what is guruji’s choice?

SOUND ENGINEER TURNED AS SILVER SCREEN ANJANEYA!