in

Sobhita reacts about dating naga chaithanya!

నేను మంచి సినిమాలు చేస్తున్నాను. మణిరత్నం డైరెక్షన్‌లో ఇటీవలే పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా చేశాను. ఇందులో ఏఆర్‌​ రెహమాన్‌ పాటలకు డ్యాన్స్‌ చేయడం అనేది ఒక అద్భుతమైన అనుభవం. ఇంత మంచి మధుర జ్ఞాపకాలు ఉన్నప్పుడు ఎవరో ఏదో అంటున్నారని దాన్ని పట్టించుకుని ఫీలైపోవాల్సిన అవసరం లేదు. ఆ రూమర్స్ తో నాకెలాంటి సంబంధం లేనప్పుడు, నేను ఏ తప్పూ చేయనప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన పనికూడా లేదు. నా పని నేను చేసుకుంటూ పోతాను’ అని చెప్పుకొచ్చింది శోభిత.

ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి సినీ ఇండస్ట్రీలో రూమర్స్ కి కొదవ ఉండదు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళపై కూడా ఇలాగే రూమర్స్ పుట్టుకొచ్చాయి.  ఓసారి లండన్‌ వెకేషన్‌లో, మరోసారి రెస్టారెంట్‌లో ఇద్దరూ జంటగా కనిపించడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది. సమంతతో విడిపోయిన తర్వాత చైకి శోభిత దగ్గరైందని, అందుకే వీరిద్దరూ జంటగా షికార్లు చేస్తున్నారని కథనాలు వినిపించాయి. ఇక తాజాగా శోభిత ఇచ్చిన క్లారిటీతో ఈ రూమర్స్ కి చెక్ పడింది..!!

happy birthday sundeep kishan!

METALIC VOICE TURNED AS GOLDEN VOICE OF TOLLYWOOD!