in

Singing sensation Shirley Setia opens up about her Tollywood career!

కృష్ణ వృoద విహారి’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది షిర్లీ సేఠియా, స్వతహాగా సింగర్ కూడా ఆయన ఆమె ఇప్పుడు సౌత్ మీద దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ లో పుట్టి పెరిగిన ఆమె ముందు సింగర్ గా యూట్యూబ్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఆమెకు లక్షలాదిమంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆమె సౌత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ముఖ్యంగా టాలీవుడ్ పరిశ్రమ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది..

ఇండియన్ సినిమా మొత్తాన్ని ముందుండి నడిపిస్తున్న టాలీవుడ్ సినీ పరిశ్రమలో తాను కూడా భాగం అవ్వడం తనకు గర్వంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి నేను తెలుగులో ఒక్క సినిమా చేసినప్పటికీ తన మీద తెలుగు ప్రేక్షకులు కురిపిస్తున్న ప్రేమ చాలా అద్భుతం అని ఆమె చెప్పుకొచ్చారు. నిజానికి ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి ఇప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులు తన పాత్రను మెచ్చి మెసేజ్లు పెడుతూ ఉంటారు అని చెప్పుకొచ్చింది. ఇక తాను తెలుగు సినిమా కథలు వింటున్నానని త్వరలోనే మరో ఆసక్తికరమైన తెలుగు ప్రాజెక్టుతో ప్రేక్షకులు ముందుకు వస్తానని ఆమె చెప్పుకొచ్చింది..!!

producer dvv danayya’s son to marry samantha!

dusky beauty Pooja Hegde waiting For Item songs!