తను ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి వెళ్లిన సయమంలో ఆ సినిమా డైరెక్టర్ తనతో వ్యవహరించిన తీరుకు షాక్ అయ్యాయని చెప్పింది. డబ్బింగ్ స్టూడియోకి వెళ్లినప్పుడు ఆ డైరెక్టర్ హాలో మేడమ్ అంటూ పలకరించాడని, తన అభిమానిని అని పరిచయం చేసుకున్నాడని చెప్పింది. ఆ తర్వాత కాసేపటికి సునీత అని పిలిచాడని, మరి కొంతసేపయ్యాక అరేయ్, కన్నా, బుజ్జి అని పిలవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపింది.
అలా మాటల మధ్యలో మేడం అని పిలుస్తూనే.. వెంటనే అరేయ్, బుజ్జి అంటూ పిలిచాడని, అతడు అలా పిలిచినప్పుడు కాస్తా చిరాగ్గా అనిపించేదని చెప్పుకొచ్చింది. తన అదృష్టం కొద్దీ అతడిని మళ్ళీ కలిసే అవకాశం రాలేదని, అప్పటికే ఆ సినిమా అయిపోందని చెప్పింది. ఆ సంఘటనను ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వోస్తుంది అంటూ సింగర్ సునీత తనకు ఎదురైన సంఘటనను గుర్తు చేసుకుంది. అయితే, సునీత ఆ డైరెక్టర్ పేరును మాత్రం చెప్పలేదు..