in

singer Sunita revealed details about how she met Ram!

రామ్‌తో సునీత‌కు ఎప్పుడు ఎలా ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌నే అనుమానం అంద‌రిలో ఉంది. దీనిపై ఆంగ్ల‌మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ద్వారా క్లారిటీ ఇచ్చింది. రామ్‌తో ప‌రిచ‌యం నాకు చాన్నాళ్లుగా ఉంది. నా సోష‌ల్ మీడియా అకౌంట్స్ అన్ని అత‌నే చూసేవాడు. ఈ క్ర‌మంలో మా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం స్నేహంగా మారింది. ఇది కొన్నాళ్ళ‌కు మ‌రింత బ‌ల‌ప‌డి పెళ్ళి వ‌ర‌కు వెళ్ళేలా చేసింది. మేమిద్ద‌రం పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాక ఈ విష‌యాన్ని ఇరు కుటుంబాల పెద్ద‌ల‌కు చెప్పాం.

వారి అంగీకారంతోనే ఈ పెళ్లి చేసుకున్నాం. నా పిల్లలు కూడా పరిస్థితుల‌ని అర్ధం చేసుకొని రెండో పెళ్ళికి ఓకే చెప్పారు. నా కుటుంబం నాకు చాలా అండ‌గా నిల‌బ‌డింది. ఇంత బాగా అర్ధం చేసుకునే పిల్ల‌లు నాకు దొర‌క‌డం నా అదృష్టం.రిసెప్ష‌న్ లాంటి కార్య‌క్ర‌మాలు కాకుండా స‌న్నిహితుల‌కు చిన్న చిన్న పార్టీలు ఇచ్చి ఆ త‌ర్వాత హ‌నీమూన్ ప్లాన్ చేసుకుంటాం అని సునీత పేర్కొంది..

Rajinikanth requests fans to not ask him to join politics!

official : kanche beauty pragya jaiswal in balayya’s next!