in

Shruti Haasan in Nani’s next co-starring Mrunal Thakur!

టీవల దసరా మూవీతో సక్సెస్ అందుకున్న నాని30 షూటింగుకి సిద్ధమయ్యాడు. జెర్సీ సినిమాతో తండ్రిగా కనిపించిన నాని, ఈ సినిమాతో మరో సారి తండ్రిగా కనిపించనున్నాడు. శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడి డైరక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై చాలా వరకు ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతున్నట్టు సమాచారం. తాజాగా మేకర్స్‌ ఈ సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు.

ఈ సినిమాలో శృతిహాసన్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా షూటింగ్‌లో కూడా జాయిన్‌ అయినట్లు సమాచారం. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో మంచి జోష్‌ మీదున్న శృతి ప్రస్తుతం తెలుగులో సలార్‌ సినిమా చేస్తుంది. ఇక ఇప్పుడు నాని సినిమాలో కీలకపాత్ర పోషించనుండటంతో ఎక్కడలేని ఆసక్తి క్రియేట్‌ అయింది. ఫాదర్‌-డాటర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నానికి జోడీగా మృణాల్ ఠాకూర్‌ నటిస్తుంది..!!

Shriya slams journalist saying ‘actresses lose shape’!

agent movie Producer Apologizes For blunder Mistake!