తప్పు చేశాము క్షమించండి అంటూ ఏజెంట్ మూవీ ఫ్లాప్ పై సంచలన కామెంట్స్ చేసాడు చిత్ర నిర్మాత అనిల్ సుంకర. ఈమేరకు తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ” ఏజెంట్ ప్లాప్ కు కారణం మేమే అని ఒప్పుకుంటున్నాం. ఇది ఒక పెద్ద పని అని మాకు తెలిసినప్పటికీ, మేము దానిని జయించాలని అనుకున్నాము, కానీ మేము బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్ను ప్రారంభించడంతో ఈ పొరపాటు జరిగింది. కోవిడ్ సమయంలో కూడా కొన్ని సమస్యలు తెలెత్తాయి. ఆ సమయంలో మేము చేసిన కొన్ని పనులు విఫలమయ్యాయి. ఇది చాలా కాస్ట్లీ తప్పు.
దీనివలన మేము చాలా నేర్చుకున్నాం. అయితే సినిమా ప్లాప్ అయ్యిందని ఎలాంటి సాకులు చెప్పాలనుకోవడం లేదు. కాకపోతే ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు అని మాత్రం హామీ ఇస్తున్నాం. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ మా హృదయపూర్వక క్షమాపణలు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ రావడంతో మినిమమ్ కలెక్షన్స్ నీ కూడా రాబట్టలేకపోయింది..!!