in

Shruti Haasan As Superstar rajinikanth’s Daughter?

రీసెంట్ గా జైలర్ సినిమాతో రజనీ లెవెల్  ఏంటో నిరూపించారు. బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అదే ఊపుతో  యాక్షన్ సినిమాలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని  తెలుస్తోంది. జైలర్  తర్వాత  మరోసారి యాక్షన్ ఎంటర్ టైనర్ కి ఓకే చెప్పారు. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఈ మూవీ తెరెకెక్కుతోంది. ఈ మూవీ కి కూలి టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్  గ్లీమ్ప్స్ రిలీజ్ చేయగా సోషల్ మీడియా వేదికగా మంచి స్పందన వచ్చింది.

నటీ నటుల గూర్చి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా, శృతి చేసిన తప్పిదం వలన ఈ విషయం బయటికి వచ్చేసింది. సోషల్ మీడియాలో శ్రుతి హాసన్  “డే వన్ కూలీ” అని పోస్ట్ చేసి. వెంటనే తప్పు తెలుసుకుని డిలీట్ చేసింది. కానీ అప్పటికే చాలామంది ఈ పోస్ట్ చూడటం వలన ఈ విషయం బయటికి వచ్చేసింది. కూలీలో శ్రుతిహాసన్ రజినీకాంత్ కూతురిగా కనిపిస్తుందని కూడా టాక్. అంటే కమల్ రియల్ కూతురు రజనీకి రీల్ కూతురుగా నటిస్తోందని తెలియటంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి..!!

Korean Star ‘Ma Dong-seok’ to play villain in Prabhas’ Spirit?

sree vishnu’s heroine Reba Monica John gets a mega project!