ఎన్.మురారి రచించిన నవల ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ ఆధారంగా డైరెక్టర్ ఫిలిప్ జాన్ ‘చెన్నై స్టోరీ’ని తెరకెక్కించాలనుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ముందుగా సమంతను కథానాయికగా ఎంచుకున్నారు. మయోసైటిస్‌తో బాధపడుతున్న సామ్ షూటింగ్స్‌కు బ్రేక్ తీసుకోవడంతో ఈ ప్రాజెక్టు నుంచి ఔట్ అయింది. ఈ గ్యాప్‌లో మేకర్స్ శ్రుతి హాసన్‌ను ఎంపిక చేశారు. డైరెక్టర్‌కు ధన్యవాదాలు చెబుతూ శ్రుతి తాజాగా ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ‘‘చెన్నైకి చెందిన నాకు.. ఆ నగర వైవిధ్యం, ప్రత్యేకతను చూపించే కథలో భాగమయ్యే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది’’ అని పోస్టు చేసింది.