in

shruthi haasan’s problems!

పుట్టలో ఏ పాము ఉందో చెప్పలేనట్టుగానే…ఎవరే సమస్యతో బాధపడుతున్నారో చెప్పలేం. దక్షిణాది టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్ మూడేళ్లుగా తాను సమస్యల్లో ఉన్నట్టు చెబుతున్నారు. సమస్య అంటే ఆర్థికపరమైనవైతే తాత్కాలికమైనవని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆమె సమస్య మానసికమైంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లోని చిత్రాల్లో నటిస్తున్న శ్రుతి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. తన అభిప్రా యాలను కుండబద్దలు కొట్టినట్టు చెబుతారనే పేరు సంపాదించుకున్నారు. లాక్‌డౌన్ వేళలో ఆమె ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పుకొచ్చారు.

మూడేళ్లుగా తాను మానసిక సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు ఆవేదనతో చెప్పారు. మానసిక సమస్య నుంచి బయట పడేందుకు అందుకు తగ్గ ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నట్టు ఆమె వివరించారు. కాగా కరోనా కారణంగా ప్రపంచ మంతా ఇప్పుడు లాక్‌డౌన్‌తో ఆగిపోతోందని శ్రుతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రకృతికి విరుద్ధమన్నారు. ఈ పరిస్థితులు అన్ని విధాలా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తాయని విచారం వ్యక్తం చేశారు. అందులో ఒకటి మానసిక సమస్యగా ఆమె పేర్కొన్నారు. అంతేకాదు, ఇదే ముఖ్యమైన సమస్యగా తాను భావిస్తున్నట్లు శ్రుతి చెప్పడం విశేషం. తాను కూడా మూడేళ్లుగా మానసిక సమస్యను ఎదుర్కొంటున్న అనుభవంతో చెబుతున్నానన్నారు. దీనికి ధ్యానం, యోగ, వ్యాయామం వంటివి మాత్రమే చికిత్స అని శ్రుతి తేల్చి చెప్పారు. తాను మూడేళ్లుగా మాసనిక సమస్యను ఎదుర్కొంటున్నట్టు శ్రుతి అనడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు తమ అభిమాన హీరోయిన్‌కి ఏమైందో అని ఆరా తీస్తున్నారు.

upasana about her married life!

only a true chiru fan can win this quiz!