in

sharwanand to get married soon!

ఏడాది టాలీవుడ్‌లో పెళ్లి సందడి నెలకొంది. కరోనా ఉన్నప్పటికీ దానిని లెక్క చేయకుండా కొద్ది మంది బంధువుల సమక్షంలో దర్శకులు, నిర్మాతలు, రచయితలు, హీరోలు ఇలా చాలా మంది పెళ్ళి పీటలెక్కారు. ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో కూడా బ్యాచిలర్ లైఫ్‌కి గుడ్ బై చెప్పి ఓ ఇంటి వాడు కావాలనుకుంటున్నాడట. ఆ హీరో ఎవరో కాదు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో శర్వానంద్ .ఇండస్ట్రీలో 16 ఏళ్ళుగా సినిమాలు చేస్తున్న శర్వానంద్ వయస్సు ప్రస్తుతం 36 ఏళ్లు. ఆయన కుటుంబం శర్వాని పెళ్లి విషయంలో ఫోర్స్ చేస్తుండగా, చిన్ననాటి స్నేహితురాలని చేసుకునేందుకు సిద్ధమయ్యాడట.

కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరి వివాహానికి పెద్ధలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంచి ముహూర్తం చూసి ఏడడుగులు వేయనున్నట్టు తెలుస్తుంది. శర్వానంద్ చేసుకోబోయే ఆ అమ్మాయి మహిళా పారిశ్రామికవేత్త అని అంటున్నారు. ఆమె ఇప్పటికే బిజినెస్‌లో సెటిల్ అయ్యారని, యువ మహిళా వ్యాపారవేత్తగా పేరు కూడా తెచ్చుకున్నారని టాక్. ఇక శర్వా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘శ్రీకారం’ మూవీ చేస్తున్నారు. మరోవైపు అజయ్ భూపతి, కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యాడు.

rajamouli about ‘aadhipurush’!

AKKINENI NAGARJUNA CDP!