in

Shankar & AR Murugadoss Team Up! Epic Combo Movie on Cards

కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన కాంబినేషన్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. స్టార్ డైరెక్టర్లు శంకర్, ఏ.ఆర్. మురుగదాస్ కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..శంకర్ రైటింగ్ టీమ్ సిద్ధం చేసిన ఓ కథపై మురుగదాస్ తనదైన శైలిలో మెరుగులు దిద్దుతున్నారట. అయితే ఈ కాంబినేషన్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అసలు ఇది సినిమా ప్రాజెక్టా? లేక కథా చర్చల వరకే పరిమితమా? అన్నది ఆసక్తికరంగా మారింది.

శంకర్ అంటే భారీ కాన్వాస్, విజువల్ గ్రాండియర్, సోషల్ మెసేజ్‌తో కూడిన కథలకు పేరు. మరోవైపు మురుగదాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌ను బలమైన కథతో మిక్స్ చేయడంలో స్పెషలిస్ట్. ఇద్దరి స్టైల్ వేర్వేరుగా ఉన్నప్పటికీ..కథ విషయంలో ఇద్దరికీ ఉన్న విజన్ కలిస్తే మాత్రం ఆసక్తికరమైన ఔట్‌పుట్ వచ్చే అవకాశం ఉంది. అసలు శంకర్ దర్శకత్వంలో మురుగదాస్ పనిచేస్తున్నారా? లేక మురుగదాస్ దర్శకత్వంలో శంకర్ కథ అందిస్తున్నారా? అనే విషయంలో మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు..!!

toxic beauty Rukmini Vasanth is pinning high career hopes on dragon!

Trisha, tamannah in talks for Nandini Reddy’s supernatural thriller!