in

shakila shocking comments on her sister!

శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెరమీద అందాలను ఆరబోసి.. ఓ వెలుగు వెలిగినా తన నిజ జీవితంలో మాత్రం చీకట్లు కమ్ముకున్నాయని షకీలా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో తన వ్యక్తిగత చేదు అనుభవాలను తెలిపిన షకీలా.. కేవలం కుటుంబాన్ని పోషించడం కోసమే తాను అలాంటి పాత్రలు చేశానని, కానీ నమ్మిన సొంత అక్కనే తనను మోసం చేసిందని చెబుతూ తీవ్ర ఆవేదన చెందింది.

తాను సినిమాలు చేస్తూ పోతుంటే డబ్బు వ్యవహారమంతా అక్కే చూసుకునేదని, అయితే చివరకు ఆ డబ్బంతా నొక్కేసి సొంత అక్కే మోసం చేస్తుందని అస్సలు ఊహించలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఒకతన్ని నమ్మి డబ్బిస్తే అతను పారిపోయాడని.. తనను ఏం చేయమంటావని అక్క అనడంతో షాకయ్యానని షకీలా చెప్పింది. .సొంత అక్క కదా అని ఏమీ చేయలేక పోయానని తెలిపింది. ఇంకా కిరాయి ఇంట్లోనే ఉంటున్నానని, అందరినీ నమ్మడం వల్లనే తనకు ఈ గతి పట్టిందని ఆమె కన్నీరు పెట్టుకుంది.

only rashmika for pushpa!

chiru reaction on trollers!