ఏక్ మినీ కథ..యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి కార్తిక్ రాపోలు దర్శకత్వం వహించారు. కావ్యథాపర్ కథానాయిక. దర్శకుడు మేర్లపాక గాంధీ కథను అందించారు. ఇటీవల ఆమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘కాన్సెప్ట్‌ను హీరోగా నమ్మి ఈ సినిమా చేశాం. కుటుంబమంతా కలిసి చూసే మంచి సినిమా ఇదని ప్రశంసలు లభిస్తుండటం ఆనందంగా ఉంది’ అని తెలిపారు
‘మనదేశంలో సెక్స్ ఎడ్యూకేషన్‌ను బూతుగానే చూస్తారు. ఆ ఆలోచన ధోరణి కారణంగా ఎదురయ్యే సమస్యల్ని అశ్లీలత లేకుండా ఆలోచనాత్మకంగా ఈసినిమాలో చూపించాం’ అని మేర్లపాక గాంధీ చెప్పారు. సంతోష్‌శోభన్ మాట్లాడుతూ ‘తెలుగు తెరపై ఎవరూచేయని భిన్నమైన పాత్రను పోషించే అరుదైన అవకాశం ఈ సినిమాతో నాకు దొరికింది’ అని పేర్కొన్నారు. తొలి విజయానుభూతినిఆస్వాదిస్తున్నానని కావ్యథాపర్ చెప్పింది..