in

sania mirza to play herself in the biopic with srk or akshay!

తాజాగా ఆమె బయోపిక్‌ గురించి ఆసక్తికర చర్చ సాగింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఓ టాక్‌ షోకి ఆమె హాజరైంది. ఈ క్రమంలో బయోపిక్స్‌ గురించి డిస్కషన్‌ వచ్చినప్పుడు ఆమె పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది అని హోస్ట్‌ అడిగితే సానియా మీర్జా ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. తన బయోపిక్‌లో నటించడానికి ఎవరైనా ఓకే అని చెప్పిన సానియా..మన దేశంలో ఈ పాత్ర చేయడానికి చాలామంది హీరోయిన్లు ఉన్నారు అని తేల్చేసింది.

అయితే, సానియా బయోపిక్‌లో ఆమె ప్రేమికుడిగా నటించడానికి తాను సిద్ధం అని గతంలో షా రుఖ్‌ ఖాన్‌ చెప్పిన మాటను హోస్ట్‌ గుర్తు చేయగా..అదే జరిగితే తన జీవిత కథలో ఆ పాత్రను తానే చేస్తాను అని సానియా మీర్జా చెప్పేసింది. అంతేకాదు షా రుఖ్‌ ఖాన్‌ లేదా అక్షయ్‌ కుమార్‌ ఎవరు నటించినా తన పాత్ర తానే చేస్తాను అని క్లారిటీ ఇచ్చేసింది. అంటే ఆమె యాక్టింగ్‌లోకి రావడానికి సిద్ధమైంది అన్నమాట..!!

omg!! Jr Ntr Shocking Remuneration For Prashanth Neel’s movie

‘avunu’ vijay devarakonda missed ravi babu’s movie!