in

sanga reddy vanga’s heroine shares a horrid experience!

బాలీవుడ్ నటి నిఖితా దత్తాకు చేదు అనుభవం ఎదురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం నిఖితా దత్తా తన స్నేహితులతో కలిసి బాంద్రాలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 7:30 ప్రాంతంలో తన ఎదురురుగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని తెలిపారు. తన చేతిలో ఉన్న ఫోన్ ను బలవంతంగా లాక్కొని..

అక్కడి నుంచి పారిపోయారని వేలలాడించారు. ఆ సమయంలో తనకు అసలేం జరుగుతుందో అర్ధం కాలేదని.. కొంతమంది స్థానికులు వాళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ దొంగలు తప్పించుకుపారిపోయారని తెలిపారు. ఆ తరువాత బాంద్రాలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు నిఖితా దత్తా తెలిపారు. ఈ బ్యూటీ ‘కబీర్ సింగ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే ‘డైబుక్’, ‘ఏక్‌డుజ్‌కే వాస్తే’, ‘దిబిగ్‌బుల్‌’ వంటి సినిమాల్లో నటించారు. నిఖితా దత్తా 2012లో జరిగిన జరిగిన ఫెమినా మిస్‌ ఇండియా ఫైనల్స్ వరకు చేరుకున్నారు. ఆ తరువాత నటిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.

8 yellu mancham mide undi dance master ayina shiva shankar!

manmadhudu director open to working with transgender assistant director!