మయోసైటిస్ వ్యాధి కారణంగా మరోసారి సినిమాలకు దూరమైనా సమంత ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఆమె ట్రీట్మెంట్ కు దాదాపు 25 కోట్లు ఖర్చు అవుతుందని, ఆ అమౌంట్ మొత్తం టాలీవుడ్ లోని ఒక స్టార్ హీరో గా అప్పుగా తీసుకున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా వీటిపై సమంత మాట్లాడుతూ “మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లా !? ఇది తప్పు..ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ చికిత్స కు అయ్యే ఖర్చు నా సంపాదనలో కొంచం మాత్రమే అవుతుంది. ఆ ఖర్చు నేను భరించగలను. నా కెరీర్ లో సంపాదించుకుంది మొత్తం దీని కోసమే ఖర్చు చేశానని నేను అనుకోవడం లేదు.
మయోసైటిస్ అనేది ఓ సమస్య మాత్రమే..వేలాది మంది ప్రజలు కూడా దీంతో బాధ పడుతున్నారు. ఇలాంటి విషయాలపై చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు దయచేసి కాస్త బాధ్యత గా ఉండాలి ” అంటూ తెలిపింది సమంత. నిజానికి ఎన్నో ఏళ్లుగా అగ్ర కథానాయికగా చలామణి అవుతున్న సమంత కు డబ్బు విషయంలో పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఆస్తులు కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. అలాంటి సమంత కు అప్పు చేయాల్సిన అవసరం లేదని అందరికీ తెలిసిన విషయమే..!!