in

Samantha to team up with Shah Rukh Khan?

ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో నార్త్ లో కూడా ఫాన్స్ ని, ఫాలోవర్స్ ని పెంచుకున్న సామ్ నెక్స్ట్ సీటాడెల్ వెబ్ సిరీస్ తో అలరించనుంది. ఇప్పటివరకు బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. సల్మాన్ సికిందర్ లో సామ్ నటిస్తుంది అన్న ప్రచారం జరిగినా ఆ ఛాన్స్ రష్మిక కొట్టేసింది. ఇప్పుడు మాత్రం ఏకంగా షారుఖ్ ఖాన్ తో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది.

అదీ కూడా మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, 3 ఇడియట్స్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రేజీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరక్షన్ లో నటించే గొప్ప అవకాశం సామ్ కి లభించింది. షారుఖ్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది జవాన్, ఢంఖీ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. హ్యాట్రిక్ కొట్టాలని ఈ సారి రాజ్ కుమార్ హిరాణీకి పచ్చజెండా ఊపాడు షారుఖ్. ఢంఖీ నిర్మాతలే ఈ మూవీని కూడా నిర్మిస్తున్నారు. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కే యాక్షన్ అడ్వంచర్ అని తెలుస్తోంది..!!

Rana Daggubati announces an Interesting Project with nivetha thomas!

andhra pradesh deputy C.M gaari thaaluka!