in

samantha still maintaining close relationship with Daggubati family!

మంత సమంత సమంత.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే పేరు. కాంట్రవర్సీ కావొచ్చు.. సినిమా అప్డేట్స్ కావొచ్చు.. తాజాగా పుష్ప ఐటం సాంగ్ సెన్సేషన్ అవ్వొచ్చు. సోషల్ ట్రెండ్స్ అన్ని సమంత చుట్టురే. అలాంటి సమంత తాజాగా మరోసారి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యింది. అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తరువాత ఆ ఫ్యామిలీతో కాస్త డిస్టెంట్ మెయిన్ టైన్ చేస్తున్న సామ్.. దగ్గుపాటి కుటుంబంతో మాత్రం మంచి సంబంధాలే కొనసాగిస్తుంది.

మొన్న చైతు బావమరిది హీరో దగ్గుపాటి రానాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన సమంత నేడు రానా భార్య మిహికా బజాజ్ కి బర్త్ డే విషెష్ చెప్పటం చర్చనీయాంశం అవుతుంది. అక్కినేని హీరోల సినిమాలు హిట్ అయినప్పుడు కానీ.. నాగచైతన్య బర్త్ డే రోజు కానీ విషెష్ చెప్పని సమంత..దగ్గుపాటి ఫ్యామిలీకి వరుసగా శుభాకాంక్షలు చెప్తుంది. అక్కినేని ఫ్యామిలీతో దూరంగా.. దగ్గుపాటి కుటుంబంతో దెగ్గరగా వేస్తున్న సమంత అడుగులపై అయితే కొత్త చర్చ నడుస్తుంది.

చైతుకి విడాకులు ఇచ్చినా.. కుటుంబస్తులతో సమంత మంచి సంబంధాలు కొనసాగిస్తుందని అంటున్నారు. ఇక నేడు రానా భార్య మిహిక బజాజ్ బర్త్ డే. ఈ సందర్బంగా సమంత విషెష్ చెప్తూ.. హ్యాపీ బర్త్ డే మిహీక.. నువ్ ఎక్కడుంటే అక్కడ నీకు మంచి జరగాలంటూ సమంత పోస్ట్ చేసింది. మొత్తానికి సమంత మాత్రం రానాతో, ఆయన భార్యతో ఇంకా క్లోజ్‌గా ఉందని అర్థమవుతోంది. ఇక వెంకీ కూతురు ఆశ్రిత అయితే సమంత పెట్టే ప్రతీ పోస్ట్‌కు కామెంట్ పెడుతూ ఉండటం గమనార్హం.

actress Hamsa Nandini diagnosed with breast cancer!

iswarya menon sizzling photoshoot stills!