in

samantha shocking comments on director’s tattoo of his wife!

టాలీవుడ్ లో ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో ఏవి కూడా అంత రేంజ్ హిట్ టాక్ ని అయితే తెచ్చుకోలేదు. పైగా అన్నీ చిన్న చిత్రాలే కాబట్టి ఈ సినిమాలు పెద్దగా అయితే టాక్ కూడా స్ప్రెడ్ కాలేదు. ఇక నెక్స్ట్ వచ్చే వారం రిలీజ్ కోసమే అంతా ఎదురు చూస్తుండగా..ఈ వారంలోనే కాస్త పెద్ద చిత్రం విజయ్ దేవరకొండ మరియు సమంత లు కలయికలో తెరకెక్కించిన చిత్రం “ఖుషి” రాబోతుంది. దీనిపై మంచి బజ్ ఉండగా ఈ చిత్రం ప్రమోషన్స్ ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. కాగా ఈ ప్రమోషన్స్ లో విజయ్ మరియు సమంత ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు పలు ఆసక్తికర అంశాలే రివీల్ చేస్తున్నారు.

అలా విజయ్ ఇంకో షాకింగ్ ఫాక్ట్ సమంత విషయంలో చెప్పాడు. తాము షూటింగ్ చేస్తున్న సమయంలో సమంత మా డైరెక్టర్ శివ నిర్వాణ చేతిపై తన భార్య పచ్చబొట్టు చూసిందట. మరి అలా చూసి “ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా” అంటూ ఓ మినీ షాక్ ఇచ్చింది అని తెలిపాడు. అయితే సమంత ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యిందో కూడా చాల మందికి అర్ధం అయ్యే ఉండొచ్చు. గతంలో సమంత మరియు తన మాజీ భర్త నాగ చైతన్య ఇద్దరూ కూడా ఒకే రకం పచ్చ బొట్లు వారి చేతులకి వేయించుకున్నారు. మరి బహుశా అలా ఏమన్నా తనకి కనెక్ట్ అయ్యి తన డైరెక్టర్ పై చిన్నగా ఫైర్ అయిపోయి ఉండొచ్చు. దీనితో ఈ సరికొత్త స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

who will save Delhi girl Ketika Sharma now?

Vikram Vedha remake with Pawan Kalyan and Ravi Teja?