in

samantha says, “the story is the hero”!

ప్రముఖ నటి సమంత తన కెరీర్ పంథాపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఇకపై తాను నటించే చిత్రాల్లో కథే ప్రధాన హీరో అని, కంటెంట్‌కే తన మొదటి ప్రాధాన్యత ఉంటుందని తేల్చిచెప్పారు. ఇటీవల ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాబోయే ప్రాజెక్టులలో హీరో ఎవరని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, “ఇకపై నేను అలాంటి సినిమాలు చేయడం లేదు” అని సమాధానమిచ్చారు..

ఈ సందర్భంగా తన ఫిలిం ఫిలాసఫీని వివరిస్తూ, “నేను చేసే సినిమాల్లో కథే హీరో అవుతుంది. కథ అనేది నిర్మాత, నటీనటుల కంటే గొప్పది” అని సమంత స్పష్టం చేశారు. మహిళా ప్రేక్షకులు తాము చూసే పాత్రలతో మమేకమయ్యేలా, తమను తాము ఆ పాత్రల్లో చూసుకునేలా ఉండే చిత్రాలు చేయడమే తన లక్ష్యమని ఆమె వివరించారు. ఇదే ఆలోచనతో ఆమె ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పై నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆమె నిర్మిస్తున్న తొలి చిత్రం ‘మా ఇంటి బంగారం’.!!

HAPPY BIRTHDAY Sudheer Babu!

Bollywood’s Nargis Fakhri Joins Balayya’s NBK 111? Details

Bollywood’s Nargis Fakhri Joins Balayya NBK 111? Details